ఈ గుడ్డు బరువు అర తులమే! | Tola, about half the weight of the egg! | Sakshi
Sakshi News home page

ఈ గుడ్డు బరువు అర తులమే!

Jan 12 2017 10:55 PM | Updated on Sep 5 2017 1:06 AM

ఈ గుడ్డు బరువు అర తులమే!

ఈ గుడ్డు బరువు అర తులమే!

గుడ్డేంది.. అర తులం బరువేంది.. అనుకుంటున్నారా.. మీరు చదివింది నిజమే. తాటిపాడుకు చెందిన చాకలి శివన్న కోడిపెట్ట రెండురోజుల క్రితం అర తులం(5 గ్రాములు) బరువైన గుడ్డును పెట్టింది.

 
 తాటిపాడు(జూపాడుబంగ్లా):  గుడ్డేంది.. అర తులం బరువేంది.. అనుకుంటున్నారా.. మీరు చదివింది నిజమే. తాటిపాడుకు చెందిన చాకలి శివన్న కోడిపెట్ట రెండురోజుల క్రితం అర తులం(5 గ్రాములు) బరువైన గుడ్డును పెట్టింది. సాధారణంగా నాటుకోడి 40 నుంచి 50 గ్రాములు, బ్రాయిలర్‌ కోడి 55 నుంచి 60 గ్రాముల బరువైన గుడ్డును పెడుతుంటాయి. శివన్న కోడిపెట్ట గుడ్డు అతి చిన్నదిగా ఉండడంతో గ్రామస్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ కాటాపై గుడ్డును ఉంచగా తూకం చూపలేదు. దీంతో 55 గ్రాములున్న గుడ్డుతో కలిపిఉంచడంతో 60 గ్రాములున్నట్లు చూపించింది.  జన్యుపరమైన లోపాలతో కోళ్లు ఇలాంటి గుడ్లు పెడుతుంటాయని పశువైద్యాధికారి అనిల్‌కుమార్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement