శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం
నెల్లూరు సిటీ: బారాషహీద్ దర్గా ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం 120 శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు.
నెల్లూరు సిటీ: బారాషహీద్ దర్గా ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం 120 శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. బారాషహీద్ దర్గా ప్రాంగణంలో పనులను శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. అక్టోబర్ రెండో వారంలో రొట్టెల పండగ జరగనుందని చెప్పారు. రెండేళ్లుగా తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశామని, దీని వల్ల ఏటా రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు. శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణంతో ఖర్చు తగ్గనుందని తెలిపారు. కార్పొరేటర్లు పిట్టి సత్యనాగేశ్వరరావు, మన్నెం పెంచలనాయుడు, ప్రశాంత్‌కుమార్, ప్రశాంత్‌కిరణ్, మేకల రామ్మూర్తి, కిన్నెరప్రసాద్, నాయకులు ప్రసాద్, నన్నేసాహెబ్, తదితరులు పాల్గొన్నారు.