
నిమ్మకు మద్దతు ధర కల్పించాలి
నకిరేకల్ : నిమ్మ రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి సైదిరెడ్డి కోరారు. స్థానిక మార్కెట్ కార్యాలయంలో శనివారం నిమ్మ వ్యాపారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.