నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి
మిర్యాలగూడ : టెయిల్‌పాండ్ భూనిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని దామరచర్ల జెడ్‌పీటీసీ శంకర్‌నాయక్ డిమాండ్ చేశారు.
మిర్యాలగూడ : టెయిల్‌పాండ్ భూనిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని దామరచర్ల జెడ్‌పీటీసీ శంకర్‌నాయక్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద టెయిల్‌పాండ్ భూ నిర్వాసితులు చేపడుతున్న రిలే దీక్షలకు మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెయిల్‌పాండ్ వల్ల ముంపుకు గురవుతున్న గ్రామాల ప్రజలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ముంపులో మునిగిపోతున్న ఎత్తిపోతల పథకాలను పుననిర్మించాలని డిమాండ్ చేశారు. రిలే దీక్షలలో లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు సైదానాయక్, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పాపానాయక్, సీపీఎం పట్టణ కార్యదర్శి జగదీష్‌చంద్ర, రైతుల సంఘం నాయకులు గోర్ల ఇంద్రారెడ్డి, కేవీపీఎస్ నాయకులు పరుశురాములు, నిర్వాసితుల కమిటీ నాయకులు లాలునాయక్, ముని, వెంకన్న, ఆంజనేయులు పాల్గొన్నారు.