జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు ముగ్గురి ఎంపిక

జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు ముగ్గురి ఎంపిక


ఈ నెల 21 నుంచి ఔరంగాబాద్‌లో పోరు

శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర పోటీల్లో కనబర్చిన పోరాట స్ఫూర్తినే జాతీయ పోటీల్లో చూపించి సిక్కోలు ఖ్యాతిని ఇనుమడింపజేయాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్ ఆకాంక్షించారు. ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు వైఎస్సాఆర్ కడప జిల్లాలో జరిగిన రాష్ట్రస్థారుు స్కూల్‌గేమ్స్ అండర్-19 (ఇండర్మీడియెట్ స్థారుు) సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీ ల్లో సిక్కోలు జట్టు తృతీయ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ జ ట్టుకు ఇప్పిలి పీడీ కె.రవికుమార్ కోచ్‌గా వ్యవహరించారు. అరుుతే చిన్నచిన్న తప్పిదాల కారణంగా ఫైనల్ బెర్తును కోల్పోరుున శ్రీకాకుళం జట్టు టోర్నీ అంతటా రాణించడం శుభసూచికం. అరుుతే ఇదే పోటీల్లో జిల్లా తరఫున అత్యద్భుతంగా రాణించిన ముగ్గురు క్రీడాకారులు జాతీయ పో టీలకు ఎంపికకావడం విశేషం. జి.హరిప్రసాద్(ఇప్పిలి), టి.శ్రీను(ఇప్పి లి), ఎ.రమణమూర్తి(తొగరాం) క్రీడాకారులు ఎంపికై నవారిలో ఉన్నారు.జాతీయ పోటీలకు నేడు పయనం

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న జాతీయ స్కూల్‌గేమ్స్ పోటీల్లో వీరుముగ్గురు ఏపీ రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ పోటీల కోసం వీరు శుక్రవారం ఇక్కడ నుంచి పయనమై వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కోడిరామ్మూర్తి స్టేడియంలో గురువారం జరిగిన అభినందన, వీడ్కోలు కార్యక్రమంలో డీఎస్‌డీఓ మాట్లాడుతూ అనతికాలంలో రాష్ట్రస్థారుు సాఫ్ట్‌బాల్ పోటీల్లో సిక్కోలు క్రీడాకారులు చెరగని ముద్ర వేయడం అభినందనీయమన్నారు.భవిష్యత్‌లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షులు, సాఫ్ట్‌బాల్ సంఘ జిల్లా ప్రధా న కార్యదర్శి ఎం.వి.రమణ, కార్యనిర్వహన కార్యదర్శి ఆర్.రవికుమార్ పీఈటీలు పాల్గొన్నారు. కాగా సాఫ్ట్‌బాల్ సంఘ జిల్లా చైర్మన్, ప్రభుత్వ విప్ కె.రవికుమార్, అధ్యక్షులు బి.హరిధరరావు, కన్వీనర్ కె.అరుణ్‌కుమార్‌గుప్త, ఆనంద్‌కిరణ్, ఎస్‌జీఎఫ్ అండర్-19 జిల్లా కార్యదర్శి కృష్ణ, ఒలింపిక్ సంఘ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, కార్యదర్శి సుందరరావు, పీఈటీలు క్రీడాకారును అభినందించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top