కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమం | The movement of the anti-labor policies | Sakshi
Sakshi News home page

కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమం

Aug 14 2016 1:36 AM | Updated on Aug 21 2018 8:07 PM

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అవలంభిస్తోన్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై సీఐటీయూ దేశవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తుందని అ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కయ్య తెలిపారు.

  • సెప్టెంబర్‌ 2న పెద్ద ఎత్తున సమ్మె
  • సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కయ్య
  • వరంగల్‌ అర్బన్‌ : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అవలంభిస్తోన్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై సీఐటీయూ దేశవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తుందని అ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కయ్య తెలిపారు.
     
    వరంగల్‌ బల్దియా ప్రధాన కార్యాలయం అవరణంలోని ప్లానిటోరియంలో శనివారం సీఐటీయూ నగర కమిటీ సమావేశం ఇనుముల శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చుక్కయ్య మాట్లాడుతూ రెండేళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారం తగ్గినా, మన దేశంలో డీజిల్, పెట్రోల్‌ రేట్లకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం సిద్ధపడడం లేదన్నారు. సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి రాగుల రమేష్‌ మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎన్‌డీఏ విధానాలపై సెప్టెంబర్‌ 2న సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. అదేరోజు ఆటో కార్మికులు బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నగర కమిటీ సభ్యులు ఎం.డీ.మహూబూబ్‌ పాషా, కాడబోయిన లింగయ్య, జన్ను ప్రకాశ్, పి.విష్ణువర్థన్, వి.నాగేశ్వర్‌రావు, సాంబయ్య, ముక్కెర రామస్వామి, పాశం రవి, జి.మహేష్, తోట్టే అశోక్, రాజబోయిన రాజు, సంపత్, డి.రమేష్, సాంబయ్య, విజేందర్, ఉప్పలయ్య, యాకుబ్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement