గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లి గోదావరికి వరద తాకిడి ఎక్కువవుతోంది.
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లి గోదావరికి వరద తాకిడి ఎక్కువవుతోంది. ఇంద్రావతి, ప్రాణహిత ఉధృతంగా ప్రవిహ స్తూ వచ్చి గోదవరిలో కలుస్తుండటంతో.. వరద ఒక్కాసారిగా పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నది 29 అడుగులు దాటి ప్రవహిస్తోంది. దీంతో స్నాన ఘట్టాలు నీటమునిగాయి.