కుటుంబ కలహాలతో ఓ మాజీ సైనికుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ కలహాలతో ఓ మాజీ సైనికుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొమరాడ మండలం నాగిరెడ్డిపల్లెలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చెన్న క్రిష్ణయ్య గత కొంత కాలంగా కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు. ఈక్రమంలో శనివారం రాత్రి భార్య భర్తల మధ్య వాదులాట జర గడంతో మనస్తాపానికి గురై అందరు నిద్రపోయాక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.