ఇద్దరు ఎర్రస్మగ్లర్లు అరెస్ట్‌ | The arrest of the two red sandil smaglars | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఎర్రస్మగ్లర్లు అరెస్ట్‌

Mar 6 2017 12:27 AM | Updated on Sep 5 2017 5:17 AM

వేర్వేరు చోట్ల ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 7 దుంగలు, ఒక సుమో వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు రాయచోటి రూరల్‌ సీఐ నరసింహరాజు తెలిపారు.

సంబేపల్లె: వేర్వేరు చోట్ల ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 7 దుంగలు, ఒక సుమో వాహనాన్ని  స్వాధీనం చేసుకొన్నట్లు రాయచోటి రూరల్‌ సీఐ నరసింహరాజు తెలిపారు. ఆదివారం సంబేపల్లె పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన  వివరాలను వెల్లడించారు. దుద్యాల గ్రామ సమీపంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారని  ముందస్తు సమాచారం అందడంతో శనివారం సంబేపల్లె ఎస్‌ఐ సయ్యద్‌ హాషం తమ సిబ్బందితో కలసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలోనే దుద్యాల వైపు నుంచి టాటా సుమో వాహనం సంబేపల్లె వైపు అతి వేగంగా వస్తుండటంతో  పోలీసులు దానిని ఆపే ప్రయత్నం చేశారు. అయితే వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో పోలీసులు వెంబడించారు. సుమోలో ఉన్న ఎర్ర దొంగలు పోలీసులపై రాళ్లురువ్వి, దాడిచేసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు చాకచక్యంగా తప్పించుకొని చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన సయ్యద్‌నదీమ్‌ అనే స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు  పారిపోయారు.  మరో సంఘనటలోదుద్యాల గ్రామం  కొత్తపురమ్మ  ఆలయం ఆర్చి సమీపంలో ఎర్రచందనం దుంగలు గోనె సంచిలో వేసుకుని వెళ్తున్న పుల్లగూర మోహన్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసి రెండు  దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement