కేసీఆర్ పనులకు ప్రచారానికి పొంతనలేదు | thammineni fires on kcr governing | Sakshi
Sakshi News home page

కేసీఆర్ పనులకు ప్రచారానికి పొంతనలేదు

Oct 8 2016 11:25 PM | Updated on Aug 14 2018 10:54 AM

మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం, (చిత్రంలో) చాడ వెంకట్‌రెడ్డి, వి.హనుమంతరావు, అజీజ్‌పాషా తదితరులు - Sakshi

మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం, (చిత్రంలో) చాడ వెంకట్‌రెడ్డి, వి.హనుమంతరావు, అజీజ్‌పాషా తదితరులు

కేసీఆర్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, ఆచరణకు పొంతన లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

అంబర్‌పేట: తెలంగాణ కుంటలను అభివృద్ధి చేస్తున్నట్లు కేసీఆర్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, ఆచరణకు పొంతన లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మిషన్ కాకతీయ పేరుతో కుంటలు , చెరువులు, బాగు చేస్తున్నామన్న ప్రభుత్వం నగరంలోని ఉన్న బతుకమ్మ కుంటను ఎందుకు పట్టించుకోలేదన్నారు.

బతుకమ్మకుంట పరిరక్షణ కోసం వీహెచ్‌ ఆధ్వర్యంలో శనివారం వేడుకల్లో ఆయన మాట్లాడుతూ బతుకమ్మ  కుంటను పరిరక్షించాలని కోరారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీలో చాలా మంది నయూంలున్నారని వారిని గుర్తించి కట్టడి చేయాలన్నారు. వీహెచ్‌ మాట్లాడుతూ..వచ్చే పండుగ నాటికి కుంటను వేడుకల కోసం అందుబాటులోకి తేవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అజీజ్‌పాషా, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement