
పవన్‌ది అనుభవ రాహిత్యం: టీజీ
ప్రత్యేక హోదా డిమాండ్‌పై ఎంపీలు తెలుగులో కాకుండా హిందీలో మాట్లాడితే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అర్థమవుతుందని చెప్పడం
ఆదోని: ప్రత్యేక హోదా డిమాండ్‌పై ఎంపీలు తెలుగులో కాకుండా హిందీలో మాట్లాడితే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అర్థమవుతుందని చెప్పడం పవన్ కల్యాణ్ అనుభవ రాహిత్యానికి నిదర్శనమని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. ఎంపీలు ఏ భాషలో మాట్లాడినా వెంటనే హిందీలోకి అనువాదం అవుతుందన్న విషయం ఆయనకు తెలియక పోవడం విచారకరమన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తిరుపతి సభలో ప్రత్యేక హోదా కోసం ఎంపీలు పోరాడాలని పవన్ కల్యాణ్ సూచించడం సరికాదన్నారు.