మిర్యాలగూడ డిపో ఎదుట ఉద్రిక్తత | tension in front of the MIRYALAGUDA bus depot | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడ డిపో ఎదుట ఉద్రిక్తత

Dec 12 2016 12:01 PM | Updated on Sep 4 2017 10:33 PM

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బస్‌డిపో ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బస్‌డిపో ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఔట్‌సోర్సింగ్ కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఆందోళన నిర్వహిస్తున్న స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కార్మికులకు ఏఐటీయూసీ తమ మద్దతు తెలిపింది.

సోమవారం ఉదయం నుంచే డిపో ఎదుట పెద్ద ఎత్తున కార్మికులు బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు యత్నించగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement