హైందవ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి | temples visit vijayendra saraswathi | Sakshi
Sakshi News home page

హైందవ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి

Dec 1 2016 11:26 PM | Updated on Sep 4 2017 9:38 PM

హైందవ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామీజీ అన్నారు. స్థానిక వైఎస్‌ రాజశేఖరరెడ్డి మున్సిపల్‌ మెమోరియల్‌ పార్కు వద్ద నూతనంగా నిర్మిస్తున్న మహాగణపతి, మహాలక్ష్మి

  • శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ
  • మండపేట : 
    హైందవ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామీజీ అన్నారు. స్థానిక వైఎస్‌ రాజశేఖరరెడ్డి మున్సిపల్‌ మెమోరియల్‌ పార్కు వద్ద నూతనంగా నిర్మిస్తున్న మహాగణపతి, మహాలక్ష్మి అమ్మవారు, రామాలయం, సాయిబాబా ఆలయాలను స్వామీజీ గురువారం సందర్శించారు. ఆలయ పనులను పరిశీలించి కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. సంప్రదాయాలను ప్రతిబింబించేవిధంగా ఆలయ నిర్మాణాలు చేయడం అభినందనీయమన్నారు. మండపాల ప్రాధాన్యాన్ని గురించి భక్తులకు వివరించారు. వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. తొలుత ఆలయ కమిటీ సభ్యులు మల్లిపూడి గణేశ్వరరావు, కొనగళ్ల సత్యనారాయణ, వేగుళ్ల పుష్పరాజు, పెనుమర్తి సుబ్బారావు తదితరులు స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దారి పొడవునా విద్యార్థులు స్వామీజీ పాదాల చెంత పూలు చల్లుతూ స్వాగతించారు. ప్రముఖ సిద్ధాంతి చంద్రాభట్ల చింతామణి గణపతిశాస్త్రి, మాజీ ఎమ్మెల్యేలు బిక్కిన కృష్ణార్జున చౌదరి, వల్లూరి రామకృష్ణచౌదరి, వల్లూరి నారాయణరావు, మున్సిపల్‌ చైర్మ¯ŒS చుండ్రు శ్రీవరప్రకాష్, వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు), టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వి.సాయికుమార్, ఆలయ కమిటీ సభ్యులు బోడా రామం, పసల కొండ తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement