సప్తగిరి సర్కిల్ లో టీడీపీ దాదాగిరి | TDP Leaders Attack on YSRCP Workers in Anantapur | Sakshi
Sakshi News home page

సప్తగిరి సర్కిల్ లో టీడీపీ దాదాగిరి

Jun 5 2016 4:30 PM | Updated on Aug 10 2018 8:46 PM

సప్తగిరి సర్కిల్ లో టీడీపీ దాదాగిరి - Sakshi

సప్తగిరి సర్కిల్ లో టీడీపీ దాదాగిరి

ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు దాదాగిరికి దిగుతున్నారు.

తాజాగా అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి దిగారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో చంద్రమోహన్ రెడ్డి అనే వైఎస్సార్ సీపీ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. గుర్తు తెలియని దుండగులు ఆయనను కత్తితో పొడిచారు. ఆయనను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు.

వైఎస్ జగన్ రోడ్ షోకు ఆటంకాలు కల్పించేందుకే టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement