ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ | tdp has killd democracy | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ

Oct 28 2016 9:12 PM | Updated on Aug 10 2018 8:23 PM

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ - Sakshi

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం పార్టీ ఖూనీ చేస్తోందని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి ఆరోపించారు.

– ఓటమి భయంతోనే కార్పొరేషన్‌ ఎన్నికలు వాయిదా
– విలేకరుల సమావేశంలో ఆర్పీఎస్‌ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
కర్నూలు సిటీ: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం పార్టీ ఖూనీ చేస్తోందని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షుడు  బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు సీఎం అయి రెండున్నరేళ్లు అయినా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడ నేరవేర్చేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిదీ డబ్బుతో కొంటున్నారన్నారు. ఒక పార్టీపై గెలిచిన వారిని సంతలో పశువులను కొన్నట్లు కోట్లు ఖర్చుపెట్టి కొంటున్నారని విమర్శించారు.  రెయిన్‌గన్లతో సీమను సస్యశ్యామలం చేశామని ప్రకటించడం దారుణమన్నారు. పంటలు కాపాడి ఉండిటే పనులు లేక రైతులు వలసలు ఎందుకు పోతున్నారో టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. ఓటమి భయంతోనే నగర పాలక సంస్థ ఎన్నికలను వాయిదా వేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థి పోటీ చేస్తారని త్వరలోనే పేరు ప్రకటిస్తామన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement