కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇటీవల కలుసుకున్న వీడియోని షేర్ చేశారు . రాజకీయం అంటే ఇలా ఉండాలని ఎన్నికల ముందు పరస్పరం విమర్శలు చేసుకున్నప్పటికీ ఎన్నికల అనంతరం పాలనలో సహకరించుకుంటున్నారని ప్రజాస్వామ్యం అంటే ఇలా ఉండాలని శశిథరూర్ అన్నారు.
శశిథరూర్ ఈ పేరు హస్తం పార్టీ నేతలకు పెద్దగా రుచించదు. తమ పార్టీకి చెందిన ఎంపీ అయినప్పటికీ ప్రత్యర్థి పార్టీ బీజేపీకి ఆయన అనుకూలంగా మాట్లాడుతారు అని ఆయనపై విమర్శలున్నాయి.అయితే తాజాగా ఆయన ట్రంప్, న్యూయర్క్ మేయర్ జోహ్రాన్ మామ్దానీకి సంబంధించిన ఒక వీడియో షేర్ చేశారు. దానిపై ఆయన మాట్లాడుతూ "ప్రజాస్వామ్యం పని చేయాల్సింది ఇలానే, ఎలక్షన్స్ లో మీఅభిప్రాయం కోసం పోరాడాలి. అది ముగిసిన తర్వాత మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల కోసం పరస్పరం సహాకరించుకుంటూ పనిచేయాలి. భారత్ లో ఇటువంటి విధానం రావాలని కోరుకుంటున్నాను. దాని కొరకు తిరువనంతపురం ఎంపీగా నా బాధ్యత నేను పూర్తి చేస్తాను" అని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
ట్రంప్, జోహ్రాన్ మామ్దానీ ఇద్దరు ఎలక్షన్ల సమయంలో పరస్పరం తీవ్రంగా విమర్శించుకున్నారు. ఎన్నికల ముగిశాక వారి భేదాభిప్రాయాలను ప్రక్కకు బెట్టి ఇరువురు నేతలు కలిసి సాధారణంగా మాట్లాడుకున్నారు. ఈ వీడియోను ఉద్దేశించి శశిథరూర్ మాట్లాడారు. కాగా థరూర్ షేర్ చేసిన వీడియోలో ఓరిపోర్టర్ మామ్దానీని మీరు ఇంకా ట్రంప్ ని ఫాసిస్ట్ గానే భావిస్తున్నారా అని అడుగుతారు. దానికి ట్రంప్ బదులిస్తూ ఆయన అలా అనుకున్నా తనకేం ప్రాబ్లం లేదు అంటారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ స్పందించింది శశిథరూర్ తమ పార్టీ నాయకత్వానికంటే దేశానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారని బీజేపీ అధికార ప్రతినిధి షెహిజాద్ పూనావాలా అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయాక కాంగ్రెస్ పార్టీ తీవ్ర అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోందని అలా కాకుండా పాలనకు సహాకరించాలని శశిథరూర్ తెలపారన్నారు. కానీ లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి ఈ సందేేశం అర్థమవుతోందా అని ఆయన పరోక్షంగా చురకులంటించారు.


