స్విమ్స్‌ వైద్య సేవల విస్తరణ | swims services enlarge | Sakshi
Sakshi News home page

స్విమ్స్‌ వైద్య సేవల విస్తరణ

Jul 30 2016 12:25 AM | Updated on Sep 4 2017 6:57 AM

స్విమ్స్‌  ఆంకాలజీ విభాగంలో నూతన పరికరాలను ప్రారంభిస్తున్న టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి

స్విమ్స్‌ ఆంకాలజీ విభాగంలో నూతన పరికరాలను ప్రారంభిస్తున్న టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌) వైద్య సేవలు రాయలసీమకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందేలా అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు

 
–అన్ని వైద్య విభాగాల్లో కొత్త పరికరాల ఆవిష్కరణ
 –క్యాన్సర్‌ రోగులకు 2వ సత్రంలో వసతి సదుపాయం
 – టీడీపీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి
 
తిరుపతి మెడికల్‌ : శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌)  వైద్య సేవలు రాయలసీమకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందేలా అన్నివిధాలా అభివృద్ధి  చేస్తామని టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. స్విమ్స్‌లో శుక్రవారం సాయంత్రం నూతన రేడియేషన్‌ ఆంకాలజి వార్డు, మెడకిల్‌ ఆంకాలజి వార్డు, బ్రాకీ వార్డు, బ్రాకీ థెరపీ, కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఆంకాలజీ విభాగాల  అధునాతన వైద్య పరికరాలను  చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో  చదలవాడ మాట్లాడుతూ   వైద్య సేవలను మరింతగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్నిరకాల ఆర్థిక సదుపాయాలను టీటీడీ సమకూరుస్తుందని తెలిపారు. దూరప్రాంతాల నుంచి వచ్చే క్యాన్సర్‌ వ్యాధి గ్రస్తుల వసతి కోసం టీటీడీ 2వ సత్రంలో 50 గదులను స్విమ్స్‌కు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు.  ఈవో సాంబశివరావు మాట్లాడుతూ  శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం కింద లభించే విరాళాలతో మరింత ఆర్థిక సహాయాన్ని స్విమ్స్‌కు అందజేస్తామని తెలిపారు.  ప్రస్తుతం ఏడాదికి రూ.30 కోట్ల మేరకు ఆర్థిక సాయాన్ని అందిస్తోందని, దీనిని రూ.40 నుంచి రూ.70 కోట్లకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.  క్యాన్సర్‌ రోగుల కోసం టీటీడీ సత్రంలో గదులు కేటాయించడంపై స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవికుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.  టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్‌ రెడ్డి పాల్గొన్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement