కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చౌటపాపాయపాలెం..
కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య
Nov 7 2016 9:20 PM | Updated on Nov 6 2018 7:56 PM
రాజుపాలెం: కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చౌటపాపాయపాలెం పరిధిలోని పులిచింతల నిర్వాచిత కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నిర్వాసిత కేంద్రానికి చెందిన కుంబా వెంకాయమ్మ(26)కు, భర్త శ్రీనివాసరావు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇంటి ఆరుబయట భార్యాభర్తలు, అత్త నిద్రించగా... వెంకాయమ్మ అర్ధరాత్రి ఇంటిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తెల్లవారు జామున గమనించిన అత్త చుట్టుపక్కల వారి సాయంతో మృతదేహాన్ని కిందికి దించారు. సీఐ శ్రీధర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎస్‌ఐ అనీల్‌కుమార్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Advertisement
Advertisement