విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
పాలకొల్లు: విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాలకొల్లు రూరల్ ఎస్‌ఐ కేఎం వంశీ తెలిపిన వివరాల ప్రకారం... చింతపర్రు గ్రామానికి చెందిన బుడితి చిన్నరాముడు శనివారం ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటికొచ్చిన ఆరో తరగతి విద్యార్థిని(11)కి మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు.
అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఆమె తండ్రి ఆదివారం పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి పంపేందుకు చర్యలు తీసుకున్నారు.