రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలు ప్రారంభం | State wide chess tourney begins | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలు ప్రారంభం

Aug 26 2016 11:54 PM | Updated on Sep 4 2017 11:01 AM

రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలు ప్రారంభం

రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలు ప్రారంభం

వెంకటాచలం: మండలంలోని సరస్వతీనగర్‌లోని అక్షర విద్యాలయంలో రాష్ట్ర స్థాయి అండర్‌–17 బాల, బాలికల చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.

 
వెంకటాచలం: మండలంలోని సరస్వతీనగర్‌లోని అక్షర విద్యాలయంలో రాష్ట్ర స్థాయి అండర్‌–17 బాల, బాలికల చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎస్సీ విశాల్‌ గున్నీ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారుల మధ్య పోటీతత్వం ఉండాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు.  అనంతరం అక్షర విద్యాలయ డైరెక్టర్‌ హరగోపాల్‌తో కాసేపు చెస్‌ ఆడారు. ఈ కార్యక్రమంలో శాప్‌ డైరెక్టర్‌ రవీంద్రబాబు, అక్షర విద్యాలయ  వైస్‌ ప్రిన్సిపల్‌ హరిప్రసాద్, జిల్లా చెస్‌ అసోషియేషన్‌ ప్రధాన కార్యదర్శి వై సుమన్, తదితరులు పాల్గొన్నారు.
చెస్‌ పోటీలకు 138మంది హాజరు
 అండర్‌–17 చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు బాల, బాలికలు మొత్తం 138 మంది హాజరయ్యారు. శుక్రవారం జరిగిన మొదటి రౌండ్‌ పోటీల్లో బాలుర విభాగంలో వై గ్రహేష్‌కుమార్, నాగసంపత్, చైతన్యసాయిరాం మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. అలాగే బాలికల విభాగంలో హర్షిత, మౌనిక అక్షయ, అలేఖ్యలు కొనసాగుతున్నారు. మొత్తం 8 రౌండ్లు పోటీలు ఉంటాయని జిల్లా చెస్‌ అసోషియేషన్‌ ప్రధాన కార్యదర్శి వై సుమన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement