తెలంగాణా రాష్ట్రానికి చెందిన 22 బీర్ సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ ఫణీంద్ర తెలిపారు.
ప్రొద్దుటూరు క్రైం: తెలంగాణా రాష్ట్రానికి చెందిన 22 బీర్ సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ ఫణీంద్ర తెలిపారు. శివాలయం వీధి సమీపంలో టంగుటూరి సత్యనారాయణ, పసుపల రమేష్‌కుమార్ అనధికారికంగా మద్యం విక్రయాలు చేస్తున్నారని సమాచారం రావడంతో గురువారం ఈఎస్‌టీఎఫ్ సీఐ రామ్మోహన్, ఎస్‌ఐ మహేంద్ర దాడి చేశారు. దాడిలో 22 బీర్ సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండుకు తరలించామని చెప్పారు.