మహిళా జెడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక గది | special room to women zptc members | Sakshi
Sakshi News home page

మహిళా జెడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక గది

Sep 19 2017 9:59 PM | Updated on Sep 20 2017 11:51 AM

వివిధ పనుల నిమిత్తం జిల్లా పరిషత్‌కు వచ్చే మహిళా జెడ్పీటీసీ సభ్యులు కూర్చుని సేద తీరేందుకు ప్రత్యేకంగా ఓ గదిని సిద్ధం చేస్తున్నారు.

అనంతపురం సిటీ: వివిధ పనుల నిమిత్తం జిల్లా పరిషత్‌కు వచ్చే మహిళా జెడ్పీటీసీ సభ్యులు కూర్చుని సేద తీరేందుకు ప్రత్యేకంగా ఓ గదిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి సదుపాయం లేకపోవడంతో మహిళా జెడ్పీటీసీ సభ్యులు స్వేచ్ఛగా కూర్చోడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్యను గుర్తించిన జెడ్పీ ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌ శుభాషిణమ్మ, సీఈఓ శోభాస్వరూపారాణిలు  మహిళా సభ్యులు సేదతీరేందుకు ప్రత్యేకంగా ఓ గదిని పరిశీలించారు. డిప్యూటీ సీఈఓ ఛాంబర్‌కు పక్కనే ఉన్న గదిని ఎంపిక చేశారు. ఈ మేరకు కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం చేసి గదిలో చిన్నపాటి మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వారు తెలిపారు. దీనిపై మహిళా జెడ్పీటీసీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement