త్వరలో భారీగా ఎస్‌ఐల బదిలీలు జరుగనున్నాయి. కృష్ణా పుష్కరాల అనంతరం ఈ బదిలీలు జరిగే అవకాశం ఉందని సమాచారం.
త్వరలో భారీగా ఎస్‌ఐల బదిలీలు
Aug 22 2016 12:02 AM | Updated on Sep 4 2017 10:16 AM
ఖమ్మం క్రైం: త్వరలో భారీగా ఎస్‌ఐల బదిలీలు జరుగనున్నాయి. కృష్ణా పుష్కరాల అనంతరం ఈ బదిలీలు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ప్రొబిషనరీ కాలం పూర్తి చేసిన ఎస్‌ఐలకు ఈ బదిలీలో పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు తెలిసింది. మంచి పోస్టింగ్‌ల కోసం ఇప్పటి నుంచే ఎస్‌ఐలు జిల్లాలో ఉన్న అధికార పార్టీల నాయకుల చుట్టు కొంతమంది ఎస్‌ఐలు తిరుగుతుండగా, మరికొంతమంది కులం పేరుతో అ«ధికార పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు చుట్టు తిరుగుతున్నట్లు సమాచారం. మంచి పోస్టులో ఉన్న కొంతమంది ఎస్‌ఐలు తాము పనిచేస్తున్న చోటు నుంచి కదలకుండా ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement