ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం | should encourage nature agriculture | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం

Feb 14 2017 11:59 PM | Updated on Oct 20 2018 4:36 PM

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం - Sakshi

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం

జిల్లాలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ నాగరాజు సూచించారు.

- క్లస్టర్‌ అసిస్టెంట్లకు డీపీఎం ఆదేశాలు
కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ నాగరాజు సూచించారు. వ్యవసాయశాఖ సమావేశ మందిరంలో మంగళవారం క్లస్టర్‌ అసిస్టెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  వచ్చే ఖరీప్‌లో ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంగా చేపట్టాలని, అందుకోసం ఇప్పటి నుంచే  రైతులను చైతన్య పరచాలన్నారు. 2016-17లో ప్రకృతి వ్యవసాయంలో సాధించిన ప్రగతిని ఇతర రైతులకు వివరించి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో వ్యవసాయాధికారి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement