ఎస్‌ఐ ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలి | Should be a comprehensive investigation on SI suicide | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలి

Aug 25 2016 12:03 AM | Updated on May 29 2018 4:26 PM

ఎస్‌ఐ ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలి - Sakshi

ఎస్‌ఐ ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలి

మెదక్ జిల్లా కుకునూరుపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై ఐపీఎస్ అధికారిచే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
 
 మఠంపల్లి: మెదక్ జిల్లా కుకునూరుపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై ఐపీఎస్ అధికారిచే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలంలోని బక్కమంతులగూడెంలో రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులను శ్రీకాంత్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ విధానం అమలు చేస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారులు, ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆ శాఖలోని పోలీసులే అధికారుల వేధింపులతో ఆత్మహత్యలకు పాల్పడుతుండటం శోచనీయమన్నారు.

రామకృష్ణారెడ్డి మృతికి కారకులైన వారికి మెమోలిస్తూ, ఎటాచ్‌లు చేస్తూ కాలం గడపకుండా వారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. రామకృష్ణారెడ్డి కుటుంబా న్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.  వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడించి రామకృష్ణారెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేందుకు పార్టీ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్‌రెడ్డి, కోడి మల్లయ్యయాదవ్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కర్నె వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కస్తాల ముత్త య్య, యూత్‌విభాగం రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement