మెడికో లీగల్‌ కేసులపై 27న సదస్సు | seminar on medico legal cases on 27th | Sakshi
Sakshi News home page

మెడికో లీగల్‌ కేసులపై 27న సదస్సు

Nov 26 2016 12:02 AM | Updated on Sep 4 2017 9:06 PM

వైద్యులు తమ వృత్తిలో ఎదుర్కొనే న్యాయపరమైన సమస్యలపై ఈ నెల 27వ తేదిన అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు కర్నూలు హార్ట్‌ ఫౌండేషన్‌ కార్యదర్శి డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ చెప్పారు.

కర్నూలు(హాస్పిటల్‌):  వైద్యులు తమ వృత్తిలో ఎదుర్కొనే న్యాయపరమైన సమస్యలపై ఈ నెల 27వ తేదిన అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు కర్నూలు హార్ట్‌ ఫౌండేషన్‌ కార్యదర్శి డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ చెప్పారు. శుక్రవారం ఆయన తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాయంత్రం 7 గంటలకు స్థానిక ఎ.క్యాంపులోని హెల్త్‌క్లబ్‌లో సదస్సు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి, గౌరవ అతిథిగా ఎస్పీ ఆకె రవికృష్ణ హాజరవుతారన్నారు. సదస్సులో వైద్యులు తమ వృత్తిలో ఎదుర్కొనే మెడికో లీగల్‌ కేసులు, న్యాయపరమైన సమస్యల గురించి సుప్రీంకోర్టు న్యాయవాది మహేంద్రకుమార్‌ బాజ్‌పాయి వివరిస్తారన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement