గోవిందపల్లెలో జరిగిన జంట హత్య కేసులో నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ ఈశ్వరరెడ్డి అన్నారు.
మూడు బృందాలతో గాలింపు
May 8 2017 11:27 PM | Updated on Sep 5 2017 10:42 AM
గోవిందపల్లె ( శిరివెళ్ల ) గోవిందపల్లెలో జరిగిన జంట హత్య కేసులో నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ ఈశ్వరరెడ్డి అన్నారు. సోమవారం గ్రామంలోని బందోబస్తును పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు కోణాల్లో సమగ్రంగా విచారణ చేసి నిందితులను అతి త్వరలోనే పట్టుకుంటామన్నారు. దర్యాప్తు వేగంగా సాగుతుందని, ఈ దశలో వివరాలు వెల్లడించలేమన్నారు. నియోజక వర్గాలలో నాయకులకు కౌన్సెలింగ్ ఇస్తామని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట సీఐ ప్రభాకరెడ్డి ఉన్నారు.
Advertisement
Advertisement