కొనసాగుతున్న స్క్రీనింగ్‌ టెస్ట్‌ | screening test continues | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న స్క్రీనింగ్‌ టెస్ట్‌

Nov 9 2016 9:36 PM | Updated on Aug 20 2018 3:37 PM

కొనసాగుతున్న స్క్రీనింగ్‌ టెస్ట్‌ - Sakshi

కొనసాగుతున్న స్క్రీనింగ్‌ టెస్ట్‌

కమ్యూనికేషన్‌ కానిస్టేబుళ్ల భర్తీకి స్క్రీనింగ్‌ టెస్టు కొనసాగుతొంది.

మూడో రోజు 424 మంది ఎంపిక  
కర్నూలు : కమ్యూనికేషన్‌ కానిస్టేబుళ్ల భర్తీకి స్క్రీనింగ్‌ టెస్టు కొనసాగుతొంది. స్థానిక ఏపీఎస్పీ మైదానంలో మూడో రోజు బుధవారం దేహదారుఢ్య పరీక్షలకు 800 మందిని ఆహ్వానించగా 710 మంది హాజరయ్యారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థుల హాల్‌టిక్కెట్, సర్టిఫికెట్ల పరిశీలించారు. అనంతరం బరువు, ఛాతీ, ఎత్తు కొలతలలో అర్హత సాధించినవారికి 1600 మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేసి పరుగు పందెం నిర్వహించగా 424 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు  215 మంది తీసుకురాకపోవడంతో క్రీడామైదానంలోకి వారిని అనుమతించకుండా వెనక్కు పంపించారు. తహసీల్దార్లు జారీ చేసిన క్రిమిలేయర్, ఓబీసీ సర్టిఫికెట్లు, ఇతర అర్హత కల్గిన ఒరిజినల్స్‌తో పాటు ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీలతో అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాలని ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు.  ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నుంచి వచ్చిన లైజనింగ్‌ డీఎస్పీ కె.షరీఫ్, ఈ–కాప్స్, మినిస్టీరియల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement