
యనిమే అభిమానుల కోసం క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా సంయుక్తంగా 'డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాసిల్' సినిమాని రిలీజ్ చేస్తున్నాయి. సెప్టెంబరు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ముంబైలో యనిమే అభిమానుల కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. హీరోయిన్ రష్మిక, హీరో టైగర్ ష్రాఫ్ కూడా సందడి చేశారు.
(ఇదీ చదవండి: నేను వెళ్లిపోవడానికి కూడా రెడీ.. బిగ్‌బాస్ 9 Day 1 ప్రోమోస్ రిలీజ్)
రష్మిక.. టాంజిరో, నెజుకో సోదర సోదరీమణులకి ప్రేరణగా ఉండే ప్రత్యేక జపనీస్ డ్రస్సులో కనిపించింది. రష్మిక కూడా అభిమానులను వారి ఫేవరెట్ సీన్ గురించి అడిగింది. దీనికి పెద్ద ఎత్తున స్పందన రావడంతో 'అకాజా vs గియు మరియు టాంజిరో' ఫైట్ సీక్వెన్స్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. మన దేశంలో దాదాపు 750కి పైగా స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదలవుతోంది. ఓ యనిమే మూవీకి ఇంతలా రిలీజ్ దక్కుతుండటం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. తెలుగు డబ్బింగ్‌తోనూ ఈ మూవీ ఉండనుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
