
బిగ్‌బాస్ షో ఏ సీజన్ తీసుకున్నా సరే కాస్త కుదురుకోవడానికి కాస్త సమయం పట్టేది. తర్వాత నామినేషన్స, గొడవలు లాంటివి ఉండేవి. ఈసారి మాత్రం వచ్చీ రాగానే మొదలుపెట్టారు. అగ్నిపరీక్ష పోటీలో గెలిచిన సామాన్యులు హరీశ్, మనీష్. తొలిరోజే గొడవ పెట్టేసుకున్నారు. ఇందుకు సంబంధించిన తొలిరోజు ప్రోమోని రిలీజ్ చేశారు.
షో ప్రారంభమైన ఆదివారం నాడే ఇల్లు క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, బట్టలు ఉతకడం లాంటి బాధ్యతలు కొందరికి అప్పగించారు. అలానే అగ్నిపరీక్షలో నెగ్గి వచ్చిన ఆరుగురు లోపల హౌస్ ఓనర్స్ అని, మిగిలిన తొమ్మిది టెనెంట్స్ అని నాగార్జున చెప్పారు. ఇప్పుడు తొలిరోజు బాధ్యతల గురించి 15 మంది మధ్య డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలోనే మాస్క్ మ్యాన్ హరీశ్, మర్యాద మనీష్ మధ్య మాటల యుద్ధం జరిగినట్లు అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
ఎవరెవరు ఏయే పనులు చేయాలనే చర్చ నడించింది. ఈ క్రమంలోనే ఒకరికొకరు అందుకు సంబంధించిన బ్యాడ్జిలు కేటాయించుకున్నారు. తినేసిన గిన్నెల్ని రీతూ చౌదరి శుభ్రం చేయాలని పవన్ బ్యాడ్జ్ ఇచ్చాడు. అలానే వంట చేసే వాళ్లు క్లీన్ చేయరు, వంట మాత్రమే చేస్తారు అని ప్రియ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. దాంతో హరీష్.. ఖాళీగా ఉన్న సంజన క్లీనింగ్ చేస్తే బాగుంటుంది అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. దీంతో మర్యాద మనీష్ కల్పించుకున్నాడు. అది కరెక్ట్ కాదు అని అనేసరికి హరీష్ ఫైర్ అయ్యాడు.
'మనీష్.. నీకు బ్యాడ్జ్ రాలేదు కదా.. మీరు మాట్లాడొద్దు' అని హరీశ్.. మనీష్‌తో అన్నాడు. ఎందుకు మాట్లాడకూడదు అని మనీష్ అడిగేసరికి ఇద్దరి మధ్య మాటల వార్ నడిచింది. మధ్యలో భరణి వచ్చి కూల్ చేసే ప్రయత్నం చేశాడు కానీ హరీష్ తగ్గినట్లు కనిపించలేదు. 'ఏదైనా అయితే నేను చూసుకుంటా.. అవసరం అయితే ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికైనా రెడీ' అని హరీష్ అన్నాడు. అలా ప్రోమో ఎండ్ చేశారు.
(ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్ ఓ గూండా.. 'దబంగ్' దర్శకుడు సంచలన కామెంట్స్)