
ఇప్పటివరకు బిగ్‌బాస్ తెలుగు షో 8 సీజన్లు పూర్తి చేసుకుంది. వచ్చే నెల 7 నుంచి కొత్త సీజన్ ప్రారంభం కానుంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి సామాన్యులకు ఎక్కువగా తీసుకునే ఉద్దేశంతో అగ్నిపరీక్ష పేరుతో పోటీ పెడుతున్నారు. రెండు వారాల పాటు సాగనున్న ఈ పోటీలో పలు గేమ్స్ పెట్టి చివరగా ముగ్గురు సామాన్యులని ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలోనే తొలి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ప్రభాస్.. రూ.50 కోట్లు తిరిగిచ్చేశాడు: డిస్ట్రిబ్యూటర్)
అగ్నిపరీక్ష షోకి శ్రీముఖి యాంకర్ కాగా.. గత సీజన్లలో పాల్గొన్న అభిజిత్, నవదీప్, బింధుమాధవి జడ్జిలుగా వ్యవహరిస్తారు. మొత్తం 45 మంది సామాన్యులకు పలు పోటలు పెట్టి చివరగా ముగ్గురుని ఎంపిక చేస్తారు. తొలి ఎపిసోడ్ ప్రోమో బట్టి చూస్తుంటే ఇది కూడా ఎంటర్‌టైనింగ్‌గానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా యాంకర్, జడ్జిలని చూసేసరికి చాలామంది కాస్త మొహమాటపడుతుంటారు. అగ్నిపరీక్షలో మాత్రం జడ్జిలతో మాట్లాడుతూ, యాంకర్ శ్రీముఖికి కౌంటర్స్ ఇస్తూ సామాన్యులు బాగానే ఫన్నీగా ఉన్నారు. ఈ ప్రోమోలో ఇద్దరమ్మాయిలు, ఓ అబ్బాయి వచ్చాడు. వాళ్లతో శ్రీముఖి-నవదీప్-బింధుమాధవి చేసిన సందడి ప్రోమోలో చూడొచ్చు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబరు 5 వరకు ఈ అగ్నిపరీక్ష గేమ్ షో ఉండనుంది.
(ఇదీ చదవండి: సల్మాన్‌తో అంత ఈజీ కాదు.. డైరెక్టర్ మురుగదాస్)