
బాలీవుడ్ స్టార్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకడు. దాదాపు 7-8 ఏళ్ల నుంచి ఇతడు సినిమాలైతే చేస్తున్నాడు గానీ హిట్ పడట్లేదు. అలాంటిది ఇతడిపై ఓ బాలీవుడ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సల్మాన్ ఓ గుండా, అతడికి నటన అంటే అసలు ఆసక్తి లేదు. సెలబ్రిటీ హోదా కోసమే మూవీస్ చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
తెలుగులో 'గబ్బర్ సింగ్' మూవీ పెద్ద హిట్. దాని ఒరిజినల్ చిత్రం 'దబంగ్'. 2010లో రిలీజైన ఈ హిందీ సినిమాకు అభినవ్ కశ్యప్ దర్శకుడు. ఇతడు అనురాగ్ కశ్యప్‌కి అన్నయ్య. అయితే సల్మాన్‍తో ఈ మూవీ చేసిన తర్వాత అభినవ్.. ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా పోయాడు. అయితే దీనికి సల్మాన్, అతడి కుటుంబమే కారణమని గతంలోనే అభినవ్ ఆరోపించాడు. ఇప్పుడు మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు.
'2010లో 'దబంగ్' సీక్వెల్ చేయమని సల్మాన్ కుటుంబం నన్ను అడిగింది. దానికి నేను నో చెప్పాను. అప్పటినుంచి నాపై పగ పెంచుకున్నారు. సల్మాన్‌కి నటనపై ఆసక్తి లేదు. 25 ఏళ్లుగా అతడు నటించడం లేదు. సెలబ్రిటీగా ఉండటానికే సెట్‌కి వస్తాడు. అతడొక గూండా. పగ-ప్రతీకారంతో రగిలిపోయే ఓ అసభ్యకరమైన వ్యక్తి. వారు చెప్పిన మాట కాదంటే వెంటాడి మరీ వేధిస్తాడు. వారందరూ రాబందులు. సల్మాన్ మాత‍్రమే కాదు బోనీ కపూర్ కూడా అలాంటోడే. నా తమ్ముడు అనురాగ్‌తో బోనీ అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకే అతడి సినిమా నుంచి అనురాగ్ బయటకొచ్చేశాడు. ఈ రాబందుల గురించి ముందే నా తమ్ముడు చెప్పాడు' అని అభినవ్ తాజాగా ఇంటర్వ్యూలో చెప్పాడు.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ తెలుగు సినిమా)