ఆలయ భూములు అన్యాక్రాంతం కానీయొద్దు | save temples land | Sakshi
Sakshi News home page

ఆలయ భూములు అన్యాక్రాంతం కానీయొద్దు

Oct 28 2016 11:54 PM | Updated on Sep 4 2017 6:35 PM

దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన భూములను అన్యాక్రాంతం కానీయొద్దని ఈవోలకు స్పెషల్‌ డిప్యుటీ కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు.

– స్పెషల్‌ డిప్యుటీ కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి
కర్నూలు(న్యూసిటీ): దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన భూములను అన్యాక్రాంతం కానీయొద్దని ఈవోలకు స్పెషల్‌ డిప్యుటీ కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం నగరేశ్వరస్వామి దేవాలయంలో మీ ఇంటికి – మీ భూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహాయ కమిషనర్‌ సి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం దేవస్థానానికి చెందిన భూముల సర్వేనంబర్లు తహసీల్దార్‌ ఆర్‌ఎస్‌ఆర్‌లో లేవన్నారు. ఆలయాల భూములు అన్యాక్రాంతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  కార్యక్రమంలో దేవాదాయ శాఖ పర్యవేక్షకుడు సుధాకర్‌రెడ్డి, ఈఓలు సత్యనారాయణ, రామాంజనేయులు, డి.ఆర్‌.కె.వి.ప్రసాద్, తిమ్మనాయుడు, బుడ్డన్న, వీరయ్య, కమలాకర్, హనుమంతరావు వాణి, కామేశ్వరీ, స్వర్ణముఖి, ఉద్యోగులు హరిశ్చంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement