ఉప్పునీటి బావే ఊపిరి తీసింది | salt water well kills boy | Sakshi
Sakshi News home page

ఉప్పునీటి బావే ఊపిరి తీసింది

Aug 16 2016 1:07 AM | Updated on Jul 12 2019 3:02 PM

ఉప్పునీటి బావే ఊపిరి తీసింది - Sakshi

ఉప్పునీటి బావే ఊపిరి తీసింది

మండల పరిధిలోని దామగట్ల జెడ్పీ హైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి మోహన్‌(15)ను గ్రామంలోని ఉప్పునీటి బావి బలితీసుకుంది.

నందికొట్కూరు: మండల పరిధిలోని దామగట్ల జెడ్పీ హైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి మోహన్‌(15)ను గ్రామంలోని ఉప్పునీటి బావి బలితీసుకుంది. అసలే మూగవాడు, ఆపై ఈతకు వెళ్లి బావిలో మునిగిపోయాడు. కేకలు వేసే అవకాశం కూడా లేకపోవడంతో ఎవరూ గమనించలేదు. నాగముని, సాలమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, మూగవాడైన కుమారుడు మోహన్‌ ఉన్నారు. సోమవారం స్కూల్లో జెండా వందనం చేసిన తర్వాత స్నేహితులతో కలిసి పంచాయితీ బోర్డు పక్కన ఉన్న ఉప్పునీటి బావిలో ఈతకు వెళ్లాడు. అందరూ కలిసి ఈత కొడుతుండగా మోహన్‌ ఉన్నట్టుండి నీటిలో మునిగిపోయాడు. విషయాన్ని గమనించినప్పటికీ పెద్దలు కొడతారనే భయంతో స్నేహితులంతా ఎవరికివారు ఇంటికి వెళ్లిపోయారు. విషయం తెలుసుకుని నీటిలో గాలించి తీసేసరికి ప్రాణాలు కోల్పోయాడు.  
 

Advertisement
 
Advertisement
Advertisement