రాయలసీమ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఎన్.టి.కె.నాయక్ మానసిక క్షోభతో ఛాతీ నొప్పికి గురయ్యారు.
ఆర్‌యూ మాజీ రిజిస్ట్రార్‌కు అస్వస్థత
Apr 29 2017 11:59 PM | Updated on Sep 5 2017 9:59 AM
- ఛాతీనొప్పితో ఆసుపత్రిలో చేరిక
- ఏడు నెలలుగా మానసిక క్షోభ
కర్నూలు(ఆర్‌యూ) : రాయలసీమ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఎన్.టి.కె.నాయక్ మానసిక క్షోభతో ఛాతీ నొప్పికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గాయత్రీ ఎస్టేట్‌లోని విజయదుర్గ కార్డియాక్ సెంటర్‌కు తరలించారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు.. మనోవేదనకు గురైనట్లు, గుండె సంబంధ సమస్యలున్నట్లు తెలిపారు. వర్సిటీలో ఇటీవలి పరిణామాలు, అధికారుల వేధింపులే ఇందుకు ప్రధాన కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Advertisement
Advertisement