breaking news
former registrar
-
మాజీ రిజిస్టార్కు పెన్షన్ కష్టాలు
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణ యూనివర్శిటీ మాజీ రిజిస్ట్రార్ తనకు రావాల్సిన పెన్షన్ బకాయిలపై భార్యతో కలిసి నిరసనకు దిగారు. ఈ ఘటన తాజాగా నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... తెలంగాణ యూనివర్సిటీలో మాజీ రిజిస్ట్రార్ ధర్మరాజు పెన్షన్ డబ్బులు రావడం లేదని రిజిస్ట్రార్ చాంబర్లో తన భార్యతో సహా బైఠాయించారు. గత మూడేళ్లుగా పెన్షన్ డబ్బులు రావట్లేదని ఆందోళన చేపట్టారు. భార్యాభర్తలు ఇద్దరూ తీవ్రంగా రోదిస్తూ...పెన్షన్ రాకపోతే ఎలా బతుకుతామని, భిక్షం ఎత్తుకుని బతకాలా అంటూ ఆవేదన చెందారు. కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
ఆర్యూ మాజీ రిజిస్ట్రార్‌కు అస్వస్థత
- ఛాతీనొప్పితో ఆసుపత్రిలో చేరిక - ఏడు నెలలుగా మానసిక క్షోభ కర్నూలు(ఆర్యూ) : రాయలసీమ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఎన్.టి.కె.నాయక్ మానసిక క్షోభతో ఛాతీ నొప్పికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గాయత్రీ ఎస్టేట్‌లోని విజయదుర్గ కార్డియాక్ సెంటర్‌కు తరలించారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు.. మనోవేదనకు గురైనట్లు, గుండె సంబంధ సమస్యలున్నట్లు తెలిపారు. వర్సిటీలో ఇటీవలి పరిణామాలు, అధికారుల వేధింపులే ఇందుకు ప్రధాన కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.