ఆర్టీసీ బస్సులో ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్ లో నుంచి మూడు తులాల బంగారు నెక్లెస్ చోరీకి గురైంది.
బస్సులో జనాలు ఉండడంతో ముందు జాగ్రత్తతో నాగరాణి మెడలోని మూడు తులాల నెక్లెస్‌ను తీసి హ్యాండ్ బ్యాగులో వేసుకుంది. కమ్మెట బస్‌స్టేజీ వద్దకు వెళ్లిన తర్వాత ఆమె అనుమానంతో బ్యాగును పరిశీలించగా తెరిచి ఉంది. బ్యాగులో నెక్లెస్ కనిపించలేదు. బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేసినా ఫలితం లేకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.