రూ.60 కోట్లతో పుష్కర పనులు | Rs 60 crores for pushkar works | Sakshi
Sakshi News home page

రూ.60 కోట్లతో పుష్కర పనులు

Aug 5 2016 10:50 PM | Updated on Sep 4 2017 7:59 AM

రూ.60 కోట్లతో పుష్కర పనులు

రూ.60 కోట్లతో పుష్కర పనులు

గుంటూరు వెస్ట్‌: పుష్కరాల సందర్భంగా 86 రోడ్లను రూ.60 కోట్ల వ్యయంతో చేపట్టినట్లు పంచాయతీరాజ్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌(ఎస్‌ఈ) జీ జయరాజు తెలిపారు.

పీఆర్‌ ఎస్‌ఈ జయరాజు
గుంటూరు వెస్ట్‌: పుష్కరాల సందర్భంగా 86 రోడ్లను రూ.60 కోట్ల వ్యయంతో చేపట్టినట్లు పంచాయతీరాజ్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌(ఎస్‌ఈ) జీ జయరాజు తెలిపారు. జిల్లా పరిషత్‌ కాంపౌండ్‌లో గల తన కార్యాలయంలో శుక్రవారం పుష్కర పనులపై ఆయన ఈఈలు, డీఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల మాట్లాడుతూ తొలివిడతలో 53 రోడ్లకుగాను రూ.33 కోట్లు మంజూరయ్యాయన్నారు. రెండో విడతలో విడుదలైన 33 పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. తమ శాఖ నుంచి సుమారు 120 మంది ఉద్యోగులు పుష్కర విధులకు హాజరవుతున్నారని వెల్లడించారు.

అంగన్‌వాడీ భవనాలు
జిల్లా వ్యాప్తంగా 636 అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకు అనుమతులు లభించాయని తెలిపారు. తెనాలి డివిజన్‌లో 193, గుంటూరు డివిజన్‌లో 253, నర్సరావుపేట డివిజన్‌లో 190 భవనాలు ఉన్నాయన్నారు. మరో 110 అంగన్‌వాడీ భవనాలకు ప్రజాప్రతినిధులు నుంచి సిఫార్సులు అందాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement