రోడ్డు ప్రమాదంలో పశువైద్యాధికారి దుర్మరణం | ROAD ACCIDENT OFFICER DEAD | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో పశువైద్యాధికారి దుర్మరణం

Apr 9 2017 12:13 AM | Updated on Aug 30 2018 4:10 PM

ఉన్నత చదువులు చదివి ఇటీవలే ఉద్యోగంలో చేరిన ఉప్పలగుప్తం మండలానికి చెందిన ఓ యువకుడు తన ఆశలు తీరకుండానే మృత్యువాత పడ్డాడు. ఉద్యోగంలో చేరి నెల రోజులు కా కుండానే అసువులు బాశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పలగుప్తం

  • ఇటీవలే బాధ్యతల స్వీకరణ
  • ఏలేశ్వరం (ప్రత్తిపాడు) : 
    ఉన్నత చదువులు చదివి ఇటీవలే ఉద్యోగంలో చేరిన ఉప్పలగుప్తం మండలానికి చెందిన ఓ యువకుడు తన ఆశలు తీరకుండానే మృత్యువాత పడ్డాడు. ఉద్యోగంలో చేరి నెల రోజులు కా కుండానే అసువులు బాశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామానికి చెందిన అవివాహితుడైన పశువైద్యాధికారి ఆకుల నాగభూషణంనాయుడు (29) రాజవొమ్మంగి మండలం జడ్డంగిలో ఇటీవలే ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. విధులు ముగిం చుకుని శనివారం తన స్వగ్రామానికి మోటారు బైక్‌పై బయలుదేరా డు. మార్గమధ్యంలో మండల పరిధి లోని జె.అన్నవరం సమీపంలోకి రాగానే ఎదురుగా వసున్న వ్యా¯ŒS ఢీకొట్టింది. తీవ్రగాయాలైన నాగభూషణం అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేçహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
     

Advertisement
 
Advertisement
Advertisement