అనపర్తి మండలం పులగుర్త గ్రామం రామకోటి ప్రాంతం వద్ద లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పోలీసుల కథనం ప్రకారం.. ద్వారపూడి గ్రామానికి చెందిన సంగడాల వెంకటేష్(35), అయినవిల్లి మండలం కె.జగన్నాథపురానికి చెందిన కొమ్మశెట్టి సురేష్(25) కలిసి ద్వారపూడిలో మాంసం దుకాణం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం వీరు రామచంద్రపురంలో కోళ్లను కొనుగోలు చేసి, మోటార్ బైక్‌పై తిరిగి వస్తున్నారు.
ఇద్దరు చిరు వ్యాపారులను బలిగొన్న లారీ
Oct 31 2016 11:49 PM | Updated on Aug 30 2018 4:10 PM
అనపర్తి(బిక్కవోలు):
అనపర్తి మండలం పులగుర్త గ్రామం రామకోటి ప్రాంతం వద్ద లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పోలీసుల కథనం ప్రకారం.. ద్వారపూడి గ్రామానికి చెందిన సంగడాల వెంకటేష్(35), అయినవిల్లి మండలం కె.జగన్నాథపురానికి చెందిన కొమ్మశెట్టి సురేష్(25) కలిసి ద్వారపూడిలో మాంసం దుకాణం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం వీరు రామచంద్రపురంలో కోళ్లను కొనుగోలు చేసి, మోటార్ బైక్‌పై తిరిగి వస్తున్నారు. అదే సమయంలో మండపేట నుంచి కాకినాడ వైపు వెళుతున్న లారీ వారి బైక్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు. ఎస్సై కె.కిషోర్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement