ఉపాధ్యాయుడిని చితకబాదారు | rivals thrash incharge headmaster in musalimadugu | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడిని చితకబాదారు

Dec 15 2016 6:55 PM | Updated on Sep 4 2017 10:48 PM

వైరా మండల పరిధిలోని ముసలిమడుగు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న టీచర్‌పై గురువారం దాడి జరిగింది.

ఖమ్మం: వైరా మండల పరిధిలోని ముసలిమడుగు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న టీచర్‌పై గురువారం దాడి జరిగింది. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాఠశాలలో ఇన్‌చార్జ్ హెచ్‌ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న కె. వెంకటేశ్వర్లు గ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లారు. అదే గ్రామానికి చెందిన నర్సింహారావు అనే వ్యక్తి టీచర్‌ను చితకబాదాడు. మధ్యాహ్నభోజనం వండే విషయంలో ఇటీవల జరిగిన వివాదమే దాడికి కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement