హిందూపురంలో ఉద్రిక్తత | riots in hindupuram | Sakshi
Sakshi News home page

హిందూపురంలో ఉద్రిక్తత

Sep 13 2016 11:10 PM | Updated on Aug 21 2018 5:54 PM

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో మంగళవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

హిందూపురం అర్బన్‌ : అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో మంగళవారం రాత్రి  ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చిన్నపాటి గొడవతో మొదలై తారస్థాయికి చేరింది.  దీంతో పోలీసులు పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు.  వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రహమత్‌పురానికిS చెందిన ఇద్దరు యువకులు వేర్వేరు బైకులపై  శ్రీకంఠపురంలో  హుషారుగా వెళ్తుండగా.. ఆ రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో అక్కడే రోడ్డుపై ఉన్న ఓ బాలుడు స్వల్పంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి ఆ బాలుడికిS చికిత్స చేయించాలని  యువకులకు సూచించారు.

అయితే..వారు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. సాయంత్రం వారు తమ వారితో కలిసి శ్రీకంఠపురం వచ్చి కాలనీవాసులతో గొడవకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాల వారికి సర్ది చెప్పారు. రహమత్‌పుర యువకులు వెనక్కి వెళ్లినట్లే వెళ్లి మరికొందరిని తీసుకుని వచ్చారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ సందర్భంగా వారు రాళ్లు రువ్వడంతో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. రాళ్ల దాడిలో రైల్వే రోడ్డు బ్రిడ్జి వరకు వీధిలైట్లన్నీ పగిలిపోయాయి.  పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన పోలీసులు అనంతపురం నుంచి ప్రత్యేక బలగాలను రప్పించారు. అలాగే ఇరువర్గాల పెద్దలను పిలిపించి సర్దిచెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement