పుష్కరాలకు వెళ్లి వస్తూ.. | return from pushkaras.. | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు వెళ్లి వస్తూ..

Aug 17 2016 12:36 AM | Updated on Apr 3 2019 7:53 PM

పుష్కరాలకు వెళ్లి వస్తూ.. - Sakshi

పుష్కరాలకు వెళ్లి వస్తూ..

ఆంధ్ర– తెలంగాణా సరిహద్దులోని దోమలపెంట సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు.

శ్రీశైలం ప్రాజెక్టు: ఆంధ్ర– తెలంగాణా సరిహద్దులోని దోమలపెంట సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలకు గురయ్యారు. హైదరాబాద్‌కు చెందిన కేశవ, సత్యనారాయణ, ఇస్మాయిల్, రాజ్‌ స్నేహితులు. వీరు కర్నూలు జిల్లాకు చెందిన వారు కాగా.. వత్తి రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం తిలక్‌నగర్‌లో నివాసముంటున్నారు. వీరంతా పుష్కరాల సందర్భంగా డ్రైవర్‌ శివకుమార్‌తో కలిసి కారులో సోమవారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. పుష్కర స్నానాలు చేసి మల్లన్న దర్శనానంతరం మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

వీరు బయలుదేరిన కొద్ది నిమిషాలకు ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొనడంతో డ్రైవర్‌ శివకుమార్‌ అక్కడిక్కడే మతి చెందాడు. గాయపడిన వారిని శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో కేశవ చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ సత్యనారాయణ, ఇస్మాయిల్‌ను హైదరాబాద్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో రాజు స్వల్పంగా గాయపడ్డాడు. మన్ననూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement