రేషన్‌ బియ్యం పట్టివేత | ration rice Captured in Khammam | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం పట్టివేత

Oct 17 2016 3:42 PM | Updated on Sep 4 2017 5:30 PM

అక్రమంగాతరలిస్తున్న 77క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా నల్లబజారుకు తరలిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించిన విజిలెన్స్‌ అధికారులు 77 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మల్లారం గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామం నుంచి 144 బస్తాల్లో రేషన్‌ బియ్యాన్ని తరలిస్తుండగా.. పోలీసుల సాయంతో దాడులు నిర్వహించిన విజిలెన్స్‌ అధికారులు బియ్యాన్ని స్వాధీనం చేసుకొని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులకు అప్పగించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement