రాజీయే రాజమార్గం.. | Rajamargam compromise .. | Sakshi
Sakshi News home page

రాజీయే రాజమార్గం..

Sep 10 2016 11:44 PM | Updated on Sep 4 2017 12:58 PM

రాజీయే రాజమార్గం..

రాజీయే రాజమార్గం..

చిన్నచిన్న సమస్యలకు పోలీసులు, కోర్టుల వద్దకు వెళ్లకుండా రాజీ మార్గాలను చూసుకోవాలని 8వ జిల్లా అదనపు న్యాయమూర్తి అజితసింహారావు అన్నారు.

 పోలీసులు, కోర్టు, అజితసింహారావు
మిర్యాలగూడ టౌన్‌ : చిన్నచిన్న సమస్యలకు పోలీసులు, కోర్టుల వద్దకు వెళ్లకుండా రాజీ మార్గాలను చూసుకోవాలని 8వ జిల్లా అదనపు న్యాయమూర్తి అజితసింహారావు అన్నారు. శనివారం స్థానిక కోర్టులో మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సినియర్‌ సివిల్‌ జడ్జి వై.సత్యేంద్ర, ప్రధాన జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.రాధాకృష్ణమూర్తి, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.నాగరాజు, స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కక్షిదారులు రాజీపడే కేసులను లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఈ సందర్భంగా 216 ఎక్సైజ్‌ కేసులు, 8 క్రిమినల్‌ కేసులు, 2 సివిల్‌ కేసులు పరిష్కరించారు. కార్యక్రమంలో లోక్‌ అదాలత్‌ సభ్యులు అలుగుబెల్లి నరేందర్‌రెడ్డి, గౌరు వెంకటేశ్వర్లు, వై.చంద్రశేఖర్‌రెడ్డి, యామినిదేవి, ఉమాశంకర్‌రెడ్డి, కొంక వెంకన్న, లింగంపల్లి శ్రీనివాస్, కిరణ్, పెంటారెడ్డి, రఘురామారావు, మండల న్యాయ సేవా సమితి సభ్యులు లింగంపల్లి అంజయ్య, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభం..
 కోర్టు ఆవరణలో మిర్యాలగూడ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఆ«ధ్వర్యంలో రూ.68 వేలతో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి వాటర్‌ ప్లాంట్‌ను 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి అజితసింహారావు, సినియర్‌ సివిల్‌ జడ్జి వై.సత్యేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు కోర్టుకు వచ్చే కక్షిదారుల కోసం వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం వాటర్‌ ఫ్లాంట్‌ను బహూకరించిన రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కర్నాటి రమేష్‌ను ఘనంగా సన్మానించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement