జిల్లాలో తేలికపాటి వర్షం | rain in slowly of district | Sakshi
Sakshi News home page

జిల్లాలో తేలికపాటి వర్షం

Jun 25 2017 11:26 PM | Updated on Sep 5 2017 2:27 PM

జిల్లాలో ఆదివారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి.

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లాలో ఆదివారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి. వజ్రకరూరులో 27.2 మి.మీ, ఓడీ చెరువు 17.6 మి.మీ, గుంతకల్లు 14 మి.మీ నమోదు కాగా నల్లమాడ, నల్లచెరువు, తనకల్లు, అమడగూరు, తాడిపత్రి, యాడికి, గుత్తి, పెద్దపప్పూరు తదితర 30 మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. జూన్‌ నెల సాధారణ వర్షపాతం 63.9 మి.మీ కాగా ప్రస్తుతానికి 58.7 మి.మీ. నమోదైంది. అరకొర పదునులోనే చాలా ప్రాంతాల్లో రైతులు ఏరువాక కొనసాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement