నాలుగు రోజుల్లో తేలికపాటి వర్ష సూచన | rain four days | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల్లో తేలికపాటి వర్ష సూచన

Jul 25 2017 10:43 PM | Updated on Jun 1 2018 8:39 PM

రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షపాతం నమోదయ్యే సూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌: రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షపాతం నమోదయ్యే సూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపారు. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు 5 నుంచి 7 మిల్లీ మీటర్లు (మి.మీ) మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 35 డిగ్రీలు, కనిష్టం 24 డిగ్రీలు నమోదు కావచ్చన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 68 నుంచి 70, మధ్యాహ్నం 49 నుంచి 51 శాతం మధ్య ఉండవచ్చన్నారు. గంటకు 9 నుంచి 11 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement