మృతుని ఆచూకీ కోసం రైల్వేపోలీసులు ఆరా | railway police enquiry | Sakshi
Sakshi News home page

మృతుని ఆచూకీ కోసం రైల్వేపోలీసులు ఆరా

Oct 18 2016 1:32 AM | Updated on Sep 4 2017 5:30 PM

మృతుని ఆచూకీ కోసం రైల్వేపోలీసులు ఆరా

మృతుని ఆచూకీ కోసం రైల్వేపోలీసులు ఆరా

నెల్లూరు(క్రైమ్‌) : చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి రైలులోనుంచి జారిపడి తీవ్రగాయాలయ్యాయి. దీంతో రైల్వే సిబ్బంది అతడిని పట్టాలపై నుంచి బయటకు తీసుకొచ్చి వివరాల కోసం ఆరాతీయగా తనది నెల్లూరు అని చెప్పాడు.

 
నెల్లూరు(క్రైమ్‌) : చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి రైలులోనుంచి జారిపడి తీవ్రగాయాలయ్యాయి. దీంతో రైల్వే సిబ్బంది అతడిని పట్టాలపై నుంచి బయటకు తీసుకొచ్చి వివరాల కోసం ఆరాతీయగా తనది నెల్లూరు అని చెప్పాడు. కొద్దిసేపటికే అతను ప్లాట్‌ఫారంపై మృతిచెందాడు. దీంతో రైల్వేపోలీసులు మృతదేహాన్ని అక్కడి ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అతని ఆచూకీ కోసం రేణిగుంట రైల్వేపోలీసులు మృతుని ఫొటోను తీసుకుని సోమవారం నెల్లూరుకు చేరుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో జరిగిన విషయం తెలియజేసి మృతుని ఆచూకీ కోసం అన్నీ పోలీసుస్టేషన్‌లలో సమాచారం అందించారు. వివరాలు తెలిసిన వారు నెల్లూరు రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని వారు సూచించారు.

Advertisement
Advertisement