క్యాష్‌లెస్‌ కాదు.. లెస్‌ క్యాష్‌ | Public awareness on the transaction | Sakshi
Sakshi News home page

క్యాష్‌లెస్‌ కాదు.. లెస్‌ క్యాష్‌

Jan 10 2017 2:08 AM | Updated on Sep 5 2017 12:49 AM

క్యాష్‌లెస్‌ కాదు.. లెస్‌ క్యాష్‌

క్యాష్‌లెస్‌ కాదు.. లెస్‌ క్యాష్‌

క్యాష్‌లెస్‌ కాదు.. లెస్‌క్యాష్‌ లావాదేవీలు అలవర్చుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ట్రెయినీ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

లావాదేవీలపై ప్రజలకు  అవగాహన కల్పించాలి
ట్రెయినీ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌


డిచ్‌పల్లి : క్యాష్‌లెస్‌ కాదు.. లెస్‌క్యాష్‌ లావాదేవీలు అలవర్చుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ట్రెయినీ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం సాయంత్రం డిచ్‌పల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలు, మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు, బ్యాంకు బిజినెస్‌ కరస్పాండెంట్‌లకు  ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్ష్యరాస్యులు అధికంగా ఉన్నారని అన్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో వంద శాతం క్యాష్‌లెస్‌ లావాదేవీలు ఆచరణ సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత ఉందని, ప్రజలు డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మొబైల్‌ ఫోన్లలో పేటీఎం, ఫ్రీచార్జ్, ఎస్‌బీఐ బడ్డీ, ఇతర యాప్‌లు డౌన్‌లోడ్‌ చేయగానే సరిపోదని, వాటిని సురక్షితంగా ఏ విధంగా వాడాలనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ నెల 15 వరకు డిచ్‌పల్లి మండలంలోని బర్ధిపూర్, అమృతాపూర్, నర్సింగ్‌పూర్, సుద్దులం గ్రామాలతో పాటు ఇందల్వాయి మండలంలోని తిర్మన్‌పల్లి, చంద్రాయన్‌పల్లి గ్రామాలను లెస్‌క్యాష్‌ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. అలాగే డిచ్‌పల్లి, ఇందల్వాయి మండలాల్లో ఎంపిక చేసిన తొమ్మిది గ్రామాలలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తి చేసి, ఈ నెల 20 లోగా బహిరంగ మలవిసర్జన లేని (ఓడీఎఫ్‌) గ్రామాలుగా ప్రకటించాలని రాహుల్‌రాజ్‌ అన్నారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి డాక్టర్‌ భరత్, ఎంపీడీవో మర్రి సురేందర్, ఈవోపీఆర్‌డీ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్‌ గణేశ్, పీఆర్‌ ఏఈ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement