వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన విశాఖ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం చోటుచేసుకుంది.
విశాఖ: వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన విశాఖ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం చోటుచేసుకుంది. చికిత్స కోసం సూర్యారావు అనే వ్యక్తి ఆస్పత్రికి వచ్చాడు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతడు మృతిచెందాడు. దాంతో సూర్యారావు మృతిచెందిన విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం కప్పిపుచ్చుకునే యత్నం చేసింది.
ఏకంగా శవానికే మెరుగైన వైద్యం అందించాలంటూ హడావుడి చేసిన ఆస్పత్రి వైద్యులు మరో ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. ఆస్పత్రి యాజమాన్యం తీరుపై అనుమానం వచ్చిన మృతుని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.